Header Banner

3 రోజులు మండే ఎండలు! హీట్ అలర్ట్ జారీ! ఇంట్లో ఉండడమే బెట్టర్!

  Mon Feb 24, 2025 09:54        Environment

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. అత్యంత తీవ్రమైన ఎండలను మనం సోమ, మంగళ, బుధవారాలు చూస్తాం. ప్రధానంగా.. వాయవ్య భారత దేశం అంటే.. గల్ఫ్ దేశాలు, రాజస్థాన్ వైపు నుంచి వేడి, పొడిగాలులు ఏపీ, తెలంగాణలోకి వస్తున్నాయి. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో వేడి పెరుగుతోంది. ముఖ్యంగా ఏపీలో ఎండ దంచేస్తోంది. ఆదివారం ఇండియాలోనే అత్యధిక ఎండ కర్నూలులో 38.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మరో 3 రోజులు ఇలాగే తీవ్ర ఎండలు ఉంటాయి అని వాతావరణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా కోస్తా, రాయలసీమలో ఎప్పుడూ కంటే.. ఓ 4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది అన్నారు. 

 

శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో రోజంతా ఎండ బాగా ఉంటుంది. మేఘాలు పెద్దగా ఉండవు. ఎక్కడైనా ఉన్నా అవి చాలా పలుచగా ఉంటాయి. అందువల్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కంటిన్యూగా దాహం వేస్తూ ఉంటుంది. ఎండలో పనులకు వెళ్లేవారు.. తరచూ నీరు, పండ్ల రసాలు తాగాల్సి ఉంటుంది. 

 

ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

గాలి వేగం చూస్తే.. ప్రస్తుతం బంగాళాఖాతం లేదా అరేబియా సముద్రంలో ఎక్కడా అల్పపీడనాలు లేవు. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గాలివేగం గంటకు 16 కిలోమీటర్లుగా ఉంది. తెలంగాణలో గంటకు 15 కిలోమీటర్లుగా ఉంది. గాలి వేగం ఎక్కువగా ఉంది కాబట్టి.. త్వరగా దాహం వేస్తుంది. 

 

నేటి ఉష్ణోగ్రతను గమనిస్తే.. ఏపీలో మాగ్జిమం 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో 34 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇవాళ పశ్చిమ రాయలసీమలో అత్యధిక వేడి ఉంటుంది. అలాగే.. ఉత్తరాంధ్ర కూడా భగ్గుమనేలా ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ వేడి ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది. 

 

తేమ బాగా తగ్గిపోయింది. తెలంగాణలో తేమ 30 శాతమే ఉంటుంది. ఏపీలో తేమ 35 శాతం ఉంటుంది. ఐతే.. పశ్చిమ రాయలసీమలో తేమ బాగా తగ్గింది. అక్కడ 19 శాతమే తేమ ఉంది. అందువల్ల ఇవాళ కర్నూలు, అధోనీ, ధోన్, నంద్యాల, గుంతకల్, రాయదుర్గం, అనంతపురం, పులివెందుల, కదిరి, హిందూపురం, కడపలో ఎండలు భగ్గుమంటాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Environment #Heat #AP #India